నాని నెక్స్ట్ సినిమా అదే ?

Sunday,September 15,2019 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’తో థియేటర్స్ లో సందడి చేస్తున్న నాని ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్ లో ‘వి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు నేచురల్ స్టార్. ఈ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు నాని. ఇందులో హను రాఘవపూడి సినిమాతో పాటు శివ నిర్వాణ సినిమా కూడా ఉంది.

లేటెస్ట్  అప్డేట్ ప్రకారం నాని నెక్స్ట్ సినిమాను శివ నిర్వాణతోనే చేయబోతున్నాడట. ‘మజిలీ’తో సూపర్ హిట్ అందుకున్న శివ ఇప్పటికే నాని సినిమాకు స్క్రిప్ట్ పూర్తి చేసేసాడని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని, అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ సినిమా వచ్చే నెల ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.