డేట్ ఫిక్స్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ?

Sunday,September 15,2019 - 01:04 by Z_CLU

వచ్చే ఏడాది సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇందులో కళ్యాణ్ రామ్ , సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ కూడా ఉంది. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా డేట్ ను కూడా ఫైనల్ చేసేసుకున్నారట. ఈ సినిమాను సరిగ్గా సంక్రాంతి రోజున అంటే జనవరి 15న రిలీజ్ చేయనున్నారని సమాచారం. రెండేళ్ళ క్రితం సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శతమానం భవతి కూడా సరిగ్గా సంక్రాంతికే థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కళ్యాణ్ రామ్ తో పాటు మరికొందరు నటీ నటులపై కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌  నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్  హీరోయిన్ గా నటిస్తుంది.