షూటింగ్ అప్ డేట్స్

Sunday,September 15,2019 - 11:05 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మరో రెండు రోజులు యూనిట్ అజీజ్ నగర్ లోని సెట్ కి షిఫ్ట్ అవుతారు. అక్కడ విజయశాంతికి సంబంధించి సీన్స్ తీయనున్నారు. ఆ తర్వాత చెన్నై లో ఓ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.


గోపీచంద్ హీరోగా బిను సుబ్ర‌మ‌ణ్యం డైరెక్షన్ లో ప్రారంభమైన సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.


రవితేజ , వి.ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి వరకూ ముంబై లో ఒక షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం గోవాలో షూట్ చేస్తున్నారు. గోవా తర్వాత ఐస్ ల్యాండ్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


నాగ చైతన్య -సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. పది రోజుల పాటు షెడ్యుల్ జరగనుంది. ఇంకో రెండు, మూడు షెడ్యుల్స్ లో టోటల్ షూట్ ని ఫినిష్ చేయనున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


కార్తికేయ హీరోగా శేఖర్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ’90ml’ షూటింగ్ డెబ్బై శాతం పూర్తయింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి కొంత టాకీ పార్ట్ తో పాటు రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పబోతున్నారు.


విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. దాదాపు కంటిన్యూగా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కె కె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.