VakeelSaab - సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి

Friday,April 16,2021 - 02:25 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా అయి, పవర్ స్టార్ స్టామినా ఏంటో రుచిచూపించింది.

vakeelsaab 2nd week poster zeecinemalu

వరల్డ్ వైడ్ ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమా,, ప్రస్తుతం ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి, ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది.

vakeelsaab 2nd week poster zeecinemalu

ఫస్ట్ వీకెండ్ తో పాటు ఉగాది, అంబేద్కర్ జయంతి లాంటి పబ్లిక్ హాలిడేస్ ఈ సినిమాకు బాగా ప్లస్ అవ్వగా.. ఈ వీకెండ్ కూడా బడా మూవీస్ బాక్సాఫీస్ బరిలో లేకపోవడం వకీల్ సాబ్ కు ఇంకాస్త ప్లస్ అయింది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈరోజు, రేపటి వసూళ్లతో కలిపి వకీల్ సాబ్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

ఇక వారం రోజుల వసూళ్లతో వకీల్ సాబ్ సినిమా మరో ఘనత కూడా సాధించింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. మొన్నటివరకు పవన్ కెరీర్ లో అత్తారింటికి దారేది సినిమా బిగ్గెస్ట్ హిట్ గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ను వకీల్ సాబ్ క్రాస్ చేసింది. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఈ వీకెండ్ వసూళ్లతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

vakeelsaab 2nd week poster zeecinemalu

ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను, ఓ స్టార్ హీరో ఇస్తే అది ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో వకీల్ సాబ్ సినిమా ప్రూవ్ చేసింది. మహిళలపై జరుగుతున్న వేధింపుల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ రీమేక్ మూవీ.. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics