Vakeelsaab పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఫిలిం !

Thursday,April 08,2021 - 12:51 by Z_CLU

పవర్ స్టార్ నుండి సినిమా వచ్చి మూడున్నరేళ్ళవుతోంది. ‘అజ్ఞాతవాసి’ తో సినిమాలకు ఫులిస్టాప్ పెట్టి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. ఆ సమయంలో ఇక సినిమాలు చేయడానికి ఆసక్తి లేదని ప్రకటించాడు. కానీ పవన్ పెట్టిన ప్రతీ పొలిటికల్ మీటింగ్ లో మళ్ళీ సినిమాల్లోకి రావాలంటూ అభిమానులు ఒత్తిడి తెచ్చారు. నిజానికి పవర్ స్టార్ మళ్ళీ సినిమాలు చేయాలని గట్టిగా కోరుకున్నారు ఫ్యాన్స్. ఆ కోరిక ఎట్టకేలకు ఇప్పుడు ‘వకీల్ సాబ్’ తో తీరబోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది.  బెన్ ఫిట్ షోలతో అభిమానులు సంబరాలు జరుపుకోనున్నారు. అయితే చిన్న గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమా పవర్ స్టార్ కి పర్ఫెక్ట్ కం బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు.

దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి రీజన్ కథ. రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ మహిళలకు న్యాయం చేసే  ఇలాంటి కథను ఎంచుకోవడం అతని రీ ఎంట్రీ కి కలిసొచ్చే అంశం. కథ పరంగా ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చి సోల్ మిస్ అవ్వకుండా ‘వకీల్ సాబ్’ ను తీర్చిదిద్దాడు దర్శకుడు శ్రీ రామ్ వేణు. సినిమా ప్రారంభమైన ఓ పదిహేను నిమిషాల తర్వాత పవన్ కథలో ఎంట్రీ ఇస్తాడు. ఆ ఎంట్రీ పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు మేకర్స్. ఇక అక్కడి నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుందట. ఇక పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు  సాంగ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్  ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటాయట. అలాగే తమన్ సాంగ్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అంటున్నారు. ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అందరినీ అలరించేలా ఉంటాయని ఇన్సైడ్ టాక్.

నిజానికి వకీల్ సాబ్ రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ కథతో ముందు వచ్చిన రెండు సినిమాలకంటే ఇది బెటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అవి 50, 70 మీటర్ లో ఉంటే ‘వకీల్ సాబ్’ 100 మీటర్ లో ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు దిల్ రాజు. సో ఇవన్నీ చూసుకుంటే పవన్ కి ‘వకీల్ సాబ్’ బెస్ట్ కమ్ బ్యాక్ ఫిలిం అవ్వడం ఖాయం అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధిస్తుందో ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

 

Also Read  దిల్ రాజు ఇంటర్వ్యూ (వకీల్ సాబ్)

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics