#RRRలో మరో కొత్త హీరోయిన్?

Tuesday,April 30,2019 - 12:43 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టులోకి ఓ కొత్త హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె మరెవరో కాదు, టాలెంటెడ్ బ్యూటీ నిత్యామీనన్. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే #RRRలో ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్ మెరవనుంది.

ఈ ప్రాజెక్టు నుంచి లాస్ట్ మినిట్ లో తప్పుకుంది ఫారిన్ నటి డెయిజీ జోన్స్. వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్టు ప్రకటించింది కూడా. ఈ పాత్ర కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు పరిశీలించారు. ఫైనల్ గా నిత్యామీనన్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట

సినిమాలో కొమరం భీమ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు యంగ్ టైగర్. అతడ్ని ఆరాధించే గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ కనిపిస్తుందట. ఇక అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్.

రామ్ చరణ్ కు దెబ్బ తగలడంతో #RRR షూటింగ్ వాయిదాపడింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ మాత్రం కొనసాగుతున్నాయి.