గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న MCA

Monday,December 11,2017 - 05:04 by Z_CLU

నాని MCA డిసెంబర్ 21 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఈ సినిమా సాంగ్స్ ని సింపుల్ గా ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. DSP కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ ఇప్పుడు సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న MCA ఈ నెల 16 న వరంగల్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. వదిన మరుదుల మధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసే ఈ అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మిడిల్ క్లాస్ న్యాచురల్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నాయి.

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్  రాజు రాజు నిర్మిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో దూసుకుపోతున్న నాని కరియర్ లో MCA కూడా మరో సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.