‘హలో’ సినిమా నాకు దక్కిన అదృష్టం – కళ్యాణి ప్రియదర్శన్

Monday,December 11,2017 - 04:02 by Z_CLU

అఖిల్ ‘హలో’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది కళ్యాణి ప్రియదర్శన్. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ‘ప్రియ’గా ఎట్రాక్ట్ చేయనున్న కళ్యాణి నిన్న జరిగిన ఆడియో ఈవెంట్ లో చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడింది.

ఈ సినిమాలో తను ప్లే చేసిన రోల్ ప్రతి హీరోయిన్ విష్ లిస్టులో ఉంటుందని, అలాంటి క్యారెక్టర్ తనకు బిగినింగ్ లో దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకున్న కళ్యాణి, ‘ఇంత ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌజ్ నుండి లాంచ్ అవ్వడం తన లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్’ అని ఫీలయింది.

గాండీవం, నిర్ణయం లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రియదర్శన్, ఆయన కరియర్ లో దాదాపు 90 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ కూతురు ‘హలో’ తో ఎంట్రీ ఇవ్వడం , ఆయన ఫ్యాన్స్ లోను ఇంట్రెస్టింగ్ క్యూరాసిటీని రేజ్ చేస్తుంది.