నాని ‘జెర్సీ’ రిలీజ్ డేట్ మారిందా..?

Friday,January 18,2019 - 01:16 by Z_CLU

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇమోషనల్ డ్రామా గా తెరకెక్కుతుంది నాని ‘జెర్సీ’. అయితే రీసెంట్ గా ఏప్రిల్ 19 న ఈ సినిమా రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ అంతలో ‘జెర్సీ’ మేకర్స్ ఈ సినిమాని మరింత ముందుగా ఏప్రిల్ 5 నే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ ఈ సినిమా చుట్టూ తిరుగుతుంది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, రిలీజ్ డేట్ మారిందనే టాక్ మాత్రం ఫ్యాన్స్ లో చిన్న సైజు వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మరోవైపు ఫుల్ ఫోకస్ షూటింగ్ పైనే పెట్టిన మేకర్స్, రిలీజ్ డేట్ చేంజ్ విషయంలో అయితే ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు.

నాని కరియర్ లోనే ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్ లో కనిపించనున్నాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి తన ఫేవరేట్ స్పోర్ట్ కి మధ్య ఇమోషన్ ని సెన్సిబుల్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్. అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.