సెట్స్ పైకి వచ్చేసిన 'ఇండియన్ 2'

Friday,January 18,2019 - 12:43 by Z_CLU

మరో అప్ కమింగ్ సెన్సేషన్ సెట్స్ పైకి వచ్చేసింది. రీసెంట్ గా 2.0 తో ఇండియన్ సినిమా మార్క్ ని వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ చేసిన దర్శకుడు శంకర్, ‘ఇండియన్ 2’ ని సెట్స్ పైకి తీసుకువచ్చేశాడు. పక్కా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకున్న మేకర్స్, ఈ రోజు నుండి సినిమా ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేశారు.

సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, సినిమా సెట్స్ పైకి వచ్చేసిందంటూ మరింత అగ్రెసివ్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. గతంలో రిలీజైన ‘భారతీయుడు’ సినిమాకి మరిన్ని రెట్లు అప్డేటెడ్ వర్షన్ లో ఈ సినిమా ఉండబోతుందన్న ఫీల్ ని జెనెరేట్ చేస్తున్నాయి ఈ పోస్టర్స్. పోస్టర్స్ లో కమల హాసన్ గెస్చర్స్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి శుభాస్కరన్ ప్రొడ్యూసర్.