‘మణికర్ణిక’ కి దక్కిన అరుదైన గౌరవం

Friday,January 18,2019 - 02:18 by Z_CLU

జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజవుతుంది ‘మణికర్ణిక’. అయితే రిలీజ్ కి ముందే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ఈ హిస్టారికల్ ఎంటర్ టైనర్. సినిమా థియేటర్ లలోకి రాకముందే దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సినిమాని చూడబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది జీ స్టూడియోస్.

రాష్టరపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ లో ‘మణికర్ణిక’ టీమ్ తో కలిసి ఈ సినిమాని చూడబోతున్నారు రాష్ట్రపతి. దాంతో ఈ సినిమాకి జస్ట్ క్రేజ్ మాత్రమే కాదు, గౌరవం కూడా దక్కుతుంది. చరిత్రలో తిరుగులేని ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మణికర్ణిక’ దేశం గర్వించదగ్గ సినిమా కానుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా కంగనా రనౌత్ నటించింది. క్రిష్ ఈ సినిమాకి డైరెక్టర్. శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. జీ స్టూడియోస్, కమాల్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.