నాని ‘జెర్సీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,November 23,2018 - 06:36 by Z_CLU

సినిమాలో క్యారెక్టర్ కి కావాల్సినంత ప్రాక్టీస్ చేసి మరీ సెట్స్ పైకి వచ్చాడు నాని. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ ‘జెర్సీ’  ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ కి ఫిక్సయ్యారు మేకర్స్. ఏప్రిల్ 19 న థియేటర్స్ లోకి రానుంది జెర్సీ.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది జెర్సీ. సత్యరాజ్ ఈ సినిమాలో నానికి కోచ్ గా కనిపించనున్నాడు. రెగ్యులర్ సినిమాలకు డిఫెరెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కరియర్ లో స్పెషల్ గా నిలిచిపోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.