‘జెర్సీ’ – సక్సెస్ వెనక 5 కారణాలు

Monday,April 22,2019 - 02:43 by Z_CLU

సోషల్ మీడియాలో ‘జెర్సీ’ సీజన్ నడుస్తుంది. రిలీజ్ కి ముందు ‘జెర్సీ’ టీమ్ ‘గొప్ప సినిమా చేసిన ఫీలింగ్’ కలిగిందని చెప్పుకుంటే, ఇప్పుడు ‘గొప్ప సినిమా చూసేశాం..’ అంటూ ఆడియెన్స్ ఫీలవుతున్నారు. అయితే ఈ ఏడాది బిగిన్ అయినప్పటి నుండి ఇన్నేసి సినిమాలు రిలీజవుతుంటే ఒక్క ‘జెర్సీ’ కే ఎందుకింత అప్రీసియేషన్ దక్కుతుంది…? దానికి 5 గట్టి కారణాలు ఉన్నాయి.

సక్సెస్ Vs హీరోయిజం :  సక్సెస్ కి హీరోయిజం కి సంబంధమే లేదని చెప్పింది ‘జెర్సీ’. రియాలిటీకి దగ్గరగా ఉన్న ప్రతి సీక్వెన్స్, ఈ రోజు ‘జెర్సీ’ ని రెగ్యులర్ సినిమాల జోన్ లో కాకుండా స్పెషల్ గా ట్రీట్ చేసేలా చేస్తుంది. నిన్నటి వరకు నాని కరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పుకుంటే, ఈ స్థాయి గొప్ప సినిమాలు అంత ఈజీగా మళ్ళీ రిలీజ్ అవ్వవు అనేంతగా మెస్మరైజ్ చేస్తుంది జెర్సీ.

మైండ్ బ్లోయింగ్ పాయింట్ :  ‘జెర్సీ’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ మాత్రం తడబడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క పాయింట్ లో చెప్పొచ్చు. బర్త్ డే గిఫ్ట్ గా ఇండియన్ ‘జెర్సీ’ కొనివ్వమని అడిగితే, ఏకంగా ఇండియన్ టీమ్ లో ప్లేస్ సంపాదించి తన ‘జెర్సీ’ ని కొడుక్కి ఇచ్చిన తండ్రి కథ ‘జెర్సీ’.

హీరోహీరోయిన్ కెమిస్ట్రీ : హీరో.. హీరోయిన్స్ కెమిస్ట్రీ ఎలివేట్ చేయాలంటే డ్యూయట్స్ పెట్టాల్సిన అవసరమే లేదు. కొన్ని కష్టాలు క్రియేట్ చేసి, వారిని ఇరిటేట్ చేస్తూ కూడా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ని ఎలివేట్ చేయొచ్చు అని నిరూపించింది ‘జెర్సీ’. అర్జున్, సారాల లవ్ స్టోరీ యూత్ కే కాదు సీనియర్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది.

నాని తీసుకున్న నిర్ణయం : ‘జెర్సీ’ కథ స్థాయిలో ఉన్నప్పుడు ‘నో’ చెప్పడానికి చాలా రీజన్స్ దొరుకుతాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాస్ వాడకుండా సినిమా అంటే రిస్కే. కానీ నాని ‘యస్’ అన్న ఒక్కమాట… ఈ రోజు ప్రతి తెలుగు ఆడియెన్ కి అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. అర్జున్ గా నానిని తప్ప ఇంకొకరిని అస్సలు ఇమాజిన్ చేసుకోలేం.

గౌతమ్ తిన్ననూరి : సినిమా గురించి మాట్లాడి దర్శకుడి గురించి మాట్లాడకుండా ముగించడం అస్సలు కరెక్ట్ కాదేమో.’జెర్సీ’ లాంటి కథను రాసుకోవడం గొప్ప విషయం  కాదేమో కానీ,    ఏ మాత్రం బ్యాలన్స్ తప్పని ఎమోషన్స్ తో ఆ కథను ట్రావెల్ చేయించడం నిజంగా అబినందించాల్సిన విషయం. సినిమాని సరిగ్గా గమనిస్తే ఎక్కడా రెగ్యులర్ సినిమాల్లాగా హెవీ BGM ప్రిఫర్ చేయలేదు గౌతమ్. తను కథ న్యారేట్ చేస్తూ వెళ్ళిపోయాడు.ఫీలయ్యిందంతా ఆడియెన్సే.