అనిరుద్ కి కలిసొచ్చిన నాని

Wednesday,April 17,2019 - 06:02 by Z_CLU

తమిళంలో సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్. టాలీవుడ్ ని కూడా అంతే సీరియస్ గా టార్గెట్ చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ లో అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో అనిరుద్ కి కూడా డెబ్యూ కే గట్టి దెబ్బ పడినట్టయింది. కొన్ని చోట్ల అనిరుద్ స్టైల్, తెలుగు సినిమాకి అంతగా మ్యాచ్ అవ్వదేమో అనే అభిప్రాయం కూడా వినిపించింది. కానీ నాని మైండ్ లో మాత్రం ఇంకేదో నడిచింది.

అనిరుద్ కి తెలుగు సినిమా మార్కెట్ పై అంతగా అవగాహన లేదు అనే అభిప్రాయం బలంగా ఉన్న సమయంలో అనిరుద్ ని ఎంచుకున్నాడు నాని. దాంతో చిన్నగా అనిరుద్ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వడం బిగిన్ అయ్యాయి. కొన్నాళ్ళకు ‘జెర్సీ’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయిందో లేదో, అనిరుద్ సత్తా కంప్లీట్ టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అనిరుద్, నాని ల కాంబో జస్ట్ ‘జెర్సీ’ తో ఆగలేదు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘గ్యాంగ్ లీడర్’ కి కూడా సంతకం చేసేశాడు అనిరుద్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మరిన్ని పెద్ద సినిమాలు కూడా అనిరుద్ కే ఫేవర్ గా ఉన్నాయని తెలుస్తున్నాయి.

ఏది ఏమైనా మొదటి సినిమా పెద్దగా కలిసి రాకపోయినా నాని అనిరుద్ ని నమ్మడం, ఈ యంగ్ మ్యూజిక్ కంపోజర్ కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇంకో సినిమా కూడా  ‘జెర్సీ’ స్థాయిలోనే రీచ్ అయిందంటే అనుమానమే లేదు. అనిరుద్ టాలీవుడ్ లో కూడా ఆల్మోస్ట్ సెటిలయిపోయినట్టే.