నాని ‘జెర్సీ’ సినిమా చేయడానికి రీజన్

Thursday,April 18,2019 - 11:59 by Z_CLU

సాధారణంగా నాని లాంటి స్టార్స్ తన దగ్గరికి వచ్చిన ప్రతి కథకి ఓకె చెప్పరు. ఫ్యాన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్.. ఇమేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ కథకి నో చెప్పడానికి ఎన్ని రీజన్స్ ఉంటాయో, యస్ చెప్పడానికి కూడా అన్ని రీజన్స్ ఉంటాయి. అలాగే నాని  ‘జెర్సీ’ సినిమా చేయడానికి కూడా ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది.

ఏ దర్శకుడు వచ్చి కథ చెప్పినా నాని ముందుగా కనెక్ట్ అయ్యేది జోనర్ కే. నటుడిగా ఎప్పటికప్పుడు ఆడియెన్స్ కి ఏదో కొత్తగా చెప్పాలి, ఏదోలా కొత్తగా కనిపించాలి అనే ప్రయత్నం చేసే నాని, కథ కాస్త కొత్తగా అనిపించినా కనెక్ట్ అయిపోతాడు. అయితే సినిమా చేయడానికి ఆ మాత్రం కనెక్టివిటీ సరిపోదు అంటాడు ఈ న్యాచురల్ స్టార్.

ఓ కొత్త జోనర్ లో సినిమా చేసినంత మాత్రాన సక్సెస్ రాదని నమ్మే నాని, ఆ జోనర్ ని ఎంత అద్భుతంగా ట్రీట్ చేశామన్నదే ఫస్ట్ ప్రయారిటీ గా ట్రీట్ చేస్తాడు. ఈ ఫిలాసఫీకి 100% రీచ్ అయింది కాబట్టే, ‘జెర్సీ’ సినిమా చేశాడు నాని. గౌతమ్ తనకి కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందనేది అంచనా వేయగలిగాను అన్నాడు నాని.

సాధారణంగా స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్టైనర్స్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కి స్కోప్ ఉండదు, కానీ ‘జెర్సీ’ ఆ బౌండరీ దాటి తెరకెక్కింది. దానికి తోడు సినిమా టైటిల్ ‘జెర్సీ’ అని పెట్టడానికి కూడా ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది అని చెప్తున్నారు మేకర్స్.  అది ఏమై ఉంటుందనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో బిగిన్ కానున్న ఈ ఎమోషనల్ జర్నీ, ఫస్ట్ డే నుండే సక్సెస్ ట్రాక్ ఎక్కడం గ్యారంటీ అనే వైబ్స్ కనిపిస్తున్నాయి.