నమిత పెళ్ళి హడావిడి బిగిన్ అయింది

Wednesday,November 22,2017 - 05:44 by Z_CLU

నమిత వెడ్డింగ్ సెలబ్రేషన్ షురూ అయింది. తిరుపతిలోని సింధూరి పార్క్ హోటల్ లో ఈ ముద్దుగుమ్మ వివాహ వేడుక మెహందీ ఫంక్షన్ తో ప్రారంభమైంది. ఈ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నమిత.

 మెహందీ ఫంక్షన్ తర్వాత ఈరోజు రాత్రి అదే హోటల్ లో సంగీత్ ఉంటుంది. ఎల్లుండి నమిత, వీరేంద్రల వివాహం తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో సంప్రదాయబద్దంగా, సింపుల్ గా జరగనుంది.

చిరకాల మిత్రులైన నమిత, వీరేంద్ర  కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఓ తమిళ రియాలిటీ షోలో ఈ విషయాన్ని నమిత పరోక్షంగా ఎనౌన్స్ చేసింది కూడా. తర్వాత తనే వీరేంద్రతో పెళ్లి విషయాన్ని బయటపెట్టింది. నమిత-వీరేంద్ర వివాహానికి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించింది నమిత.