సెట్స్ పైకొచ్చిన నాగశౌర్య

Monday,October 12,2020 - 06:51 by Z_CLU

లాక్ డౌన్ కు ముందు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఇప్పుడు అన్ లాక్ లో ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. హైదరాబాద్ లో ఈ సినిమా షూట్ రీ-స్టార్ట్ అయింది.

NagaShourya Ritu Varma Movie

 

ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో శౌర్య సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు జరిగిన షెడ్యూల్ హీరోహీరోయిన్లు ఇద్దరూ సెట్స్ పైకి వచ్చారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ షూట్ స్టార్ట్ అయింది.

NagaShourya Ritu Varma Movie

ఈ మూవీతో లక్ష్మీసౌజన్య డైరక్టర్ గా పరిచయమౌతోంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత.