Vakeel Saab - పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్
Friday,October 16,2020 - 02:05 by Z_CLU
పవర్ స్టార్ Pawan Kalyan రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కు సంబంధించి పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ సెట్స్ పైకి రాగా.. దసరా తర్వాత పవన్ కూడా సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. మరోవైపు దసరాకు టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారు.
ఇప్పుడీ మూవీకి సంబంధించి పవన్ నుంచి మరో గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. Vakeel Saab Promotion ను అఫీషియల్ గా స్టార్ట్ చేయమని, ప్రొడ్యూసర్ దిల్ రాజుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ చాలా తక్కువ. దసరా నుంచి రిలీజ్ వరకు వకీల్ సాబ్ కు సంబంధించి పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్, లిరికల్ వీడియోస్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.
వేణు శ్రీరామ్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.