దేవిశ్రీ కి నాగ్ విషెస్

Saturday,May 13,2017 - 05:23 by Z_CLU

మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కు హీరో నాగార్జున స్పెషల్ విషెష్ చెప్పారు. ఈనెల 27 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాడు దేవిశ్రీ. ఈ సందర్భంగా దేవి కి తన శుభాకాంక్షలు అందించాడు కింగ్.

“దేవి కి ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువని తన ఎనర్జీ చూస్తే ముచ్చటేస్తుందని..ఎప్పుడు పాజిటీవ్ మూడ్ లోనే ఉండే దేవి ఏది చేసిన అందులో కచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని ఇప్పుడు కూడా ఈ ప్రత్యేక సంగీత ప్రదర్శనలో మంచి విజయం సాధించి తెలుగు వాళ్ళందరూ గర్వపడే రేంజ్ లో తన పెర్ఫార్మెన్స్ తో అక్కడ వారందరినీ ఆకట్టుకుంటాడని కొనియాడారు.

నాగార్జున నటించిన మన్మధుడు, మాస్, కింగ్, డమరుకం, భాయ్ సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. మన్మధుడు సినిమా నుంచి వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ కంటిన్యు అవుతుంది.. సో తనకు అదిరిపోయే సాంగ్స్ అందించిన దేవి కి ఈ సందర్భంగా విషెస్ అందించి ఆల్ ది బెస్ట్ చెప్పాడు నాగ్.