పవన్ కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్

Saturday,May 13,2017 - 01:12 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో పవన్ పై తీయబోతున్న ఓ ఫైట్ కోసం ఫారిన్ ఫైట్ మాస్టర్ ను ప్రత్యేకంగా ఇండియాకు రప్పించారట.

అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఈ ఫైట్ మాస్టర్ పర్యవేక్షణలోనే త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ తీయబోతున్నారు. స్వతహాగా పవన్ కు మార్షన్ ఆర్ట్స్ లో టచ్ ఉంది. ఇప్పుడు ఆ స్కిల్స్ కు ఫారిన్ ఫైట్ మాస్టర్ కూడా యాడ్ అయ్యాడు. సినిమాలో ఇదే స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని టాక్. మరీ ముఖ్యంగా ఇది ఎంట్రీ ఫైట్ అని తెలుస్తోంది.

రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు.