'రారండోయ్ వేడుక చూద్దాం' ట్రైలర్ రివ్యూ

Saturday,May 13,2017 - 06:17 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా మే 26 న రిలీజ్ కి రెడీ అవుతుంది.. బ్యూటిఫుల్ లవ్ & ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం…

నాగచైతన్య లవర్ బాయ్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతుందనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ కూడా తోడై సినిమా పై ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకొనేలా చేసింది.
ఈ సినిమా ఎలా ఉంటుందా.. అని ఎంతో క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్న అక్కినేని ఫాన్స్ కి ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చేశాడు చైతు.

 

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ డప్పు వాయిస్తూ స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ “నా మనవరాలికి ఆలాంటోడు ఇలాంటోడైతే సరిపోతున్నాడనుకుంటున్నావేంటి.. ఆకాశం లోంచి దిగొచ్చేంత గొప్పవాడు రావాలి..ఒక్క మాట లో చెప్పాలి అంటే రాజకుమారుడు లాంటి వాడు రావాలి”.. అంటూ నటి అన్నపూర్ణమ్మ చెప్తూ దేవి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఊపందుకుంది..

ఇక నాగ చైతన్య ను చూస్తూ “నానమ్మ చూడ్డానికి బాగున్నాడు కానీ కొంచెం ఓవరాక్షన్ గాడిలా ఉన్నాడు కదా”.. అంటూ రకుల్ చెప్పే ఫన్నీ డైలాగ్…

“మంచి తనం- మొండితనం-పిచ్చి తనం-పెంకితనం అన్ని మిక్సీలో వేసి కొడితే నువ్వు” అంటూ చైతు చెప్పే డైలాగ్ చైతు ని రకుల్ టైంపాస్ కోసం పిలిచే సీన్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అంటూ చైతు ని రకుల్ అడిగే సీన్ తో ఎంటర్టైన్ చేసిన ఈ ట్రైలర్ “నాన్న ఎక్కువా ఏంటి ఎక్కువే అంటూ” ఎమోషనల్ మూడ్ లోకి తీసుకెళ్లి ఆ తర్వాత చైతు లోని మాస్ యాంగిల్ ను బయటపెట్టి అదుర్స్ అనిపించింది..

ఓవరాల్ గా ఫన్నీ సీన్స్, చైతు-రకుల్ మధ్య వచ్చే లవ్ సీన్స్ తో పాటు తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ , చైతు సీరియస్ గా చేసే ఫైట్, అసలు కథేంటి? అనే క్యూరియాసిటీ నెలకొలిపే సీన్స్,  మ్యూజిక్, సినిమాటోగ్రఫీ తో ఆకట్టుకున్న  ఈ ట్రైలర్ ఫైనల్ గా “భ్రమరాంబ పెళ్లి జరిగేది నాతో” అంటూ రిలీజ్ డేట్ తో ఎండ్ అయింది..

ఇక ట్రైలర్ క్లైమాక్స్ లో “అమ్మాయిలు మనశాంతి కి హానికరం” అంటూ యూత్ ని ఎగ్జైట్ చేసే డైలాగ్ తో టోటల్ గా ఫినిష్ అయి మెస్మరైజ్ చేసి సినిమా పై భారీ అంచనాలను నెలకొలిపింది.. ఓవరాల్ గా అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ ట్రైలర్ అటు అక్కినేని ఫాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది..