

Thursday,September 22,2022 - 10:58 by Z_CLU
Venkatesh as GOD in Vishwaksen’s Ori Devuda Movie
ఈ ప్రకటన అందరిలోనూ ఆసక్తిని మరింతగా పెంచింది. గ్లింప్స్‌ను గమనిస్తే.. వెంకటేష్ కూల్, స్టైలిష్ లుక్ కనపడే దేవుడు క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని అర్థమవుతుంది. చుట్టూ పుస్తకాలు.. సీతాకోక చిలుకలు మధ్య విశ్వక్ సేన్ కనిపించారు. విక్టరీ వెంకటేష్ అంటే ఓ మేనరిజమ్ ఉంటుంది. ఆ మేనరిజమ్‌తో ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులకు గ్లింప్స్ చివరలో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయటం డబుల్ సర్‌ప్రైజ్. దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. పివిపి సినిమా బ్యానర్స్‌పై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఓరి దేవుడా’ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. విజయ్ ఈ చిత్రాన్ని ఎడిటర్‌గా, విదు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.