స్పై థ్రిల్లర్ తో మెగా డైరెక్టర్ పాన్ ఇండియా వెబ్ సిరీస్

Saturday,June 17,2023 - 03:07 by Z_CLU

వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాతో బిజీగా ఉన్న  ప్రవీణ్ సత్తారు ఓ వైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఓటీటీ ఆడియన్స్ కోసం ‘మిషన్ తషాఫి’ అనే స్పై థ్రిల్లర్ సిరీస్ మొదలు పెట్టాడు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకి బ్రాండ్ గా మారిన ప్రవీణ్ సత్తారు ఈ సారి భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ తో సిద్ధమవుతున్నాడు.

ఇక ఈ సీరీస్ కోసం ఇప్పటి వరకు ఏ OTT చేయని సాహసం చేస్తుంది Zee5. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పై థ్రిల్లర్ ని ఫస్ట్ ఎవర్ ప్యాన్ ఇండియన్ సిరీస్ గా రిలీజ్ చేయబోతుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సిరీస్ కోసం ఫారిన్ లొకేషన్ కి వెళ్లి షూటింగ్ జరుపుకున్న దాఖలాలు లేవు. కానీ ఫస్ట్ టైమ్ Zee5 లో రిలీజ్ అవుతున్న ‘మిషన్ తషాఫి’ సిరీస్ లోని కీ సీక్వెన్సెస్ కోసం, జార్జియా లో షూటింగ్ జరుపుకోనుంది టీమ్.

రీసెంట్ గా పులి మేక, వ్యవస్థ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ అందించిన Zee5 , తెలుగు ఆడియెన్స్ కోసం ప్రతీ నెల ఒక వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ని సర్ ప్రయిజ్ చేస్తూనే ఉంది. సిరీస్ సెట్స్ పైకి వచ్చిందనే న్యూస్ తోనే, ఆడియెన్స్ లో క్యూరాసిటీ ని బిల్డ్ చేయడం మొదలుపెట్టిన Zee5 , అన్నీ కుదిరితే డిసెంబర్ కల్లా ఈ సిరీస్ ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది.