Nagarjuna-Praveen Sattar - మూవీ లాంఛ్

Tuesday,February 16,2021 - 05:08 by Z_CLU

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం.

కింగ్ నాగార్జున హీరోగా గ‌రుడ‌వేగ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ఈ రోజు( ఫిబ్ర‌వ‌రి 16) పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “నిన్న‌నే హిందీ సినిమా `బ్రహ్మాస్త్ర‌` షూటింగ్ పూర్తిచేసుకుని వ‌చ్చాను. ఈరోజు ఈ సినిమా స్టార్ట్ చేశాను. టైటిల్ ఇంకా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఇలాంటి ఒక ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి చాలా రోజులు అయింది. లండ‌న్‌, ఊటీ, గోవా, హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌ర‌ప‌నున్నారు“ అన్నారు.

ఇదొక స్టైలిష్ యాక్ష‌న్ ఫిలిం అంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తార్. త్వరలోనే హైద‌రాబాద్‌లో 10 రోజుల పాటు షూటింగ్ జ‌రిపి మార్చిలో గోవాలో 15 రోజులు షూటింగ్‌ ప్లాన్ చేశారు.. ఆ త‌ర్వాత ఊటీ, లండ‌న్‌లో షూటింగ్ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్స్ తో పాటు సౌత్ కొరియాలో నాలుగు రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు.

Nagarjuna Praveen Sattaru movie Launch 1