Ghani రిలీజ్ పోస్ట్ పోన్ ?

Tuesday,February 16,2021 - 05:30 by Z_CLU

కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ‘గని’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ 10 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా సినిమాకు సంబంధించి మొన్నీ మధ్యే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. జులై 30 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు .

అయితే ఇప్పుడా డేట్ కి ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటింగ్  సినిమా ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానుంది. ఇటివలే టీజర్ రిలీజ్ చేసి డేట్ లాక్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు యూవీ నిర్మాతలు. ఇలా ఉన్నపళంగా తమ సినిమా రిలీజ్ డేట్ కి ప్రభాస్ సినిమా రానుండటంతో ‘గని’ విడుదలను వాయిదా వేసుకొనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే మరో డేట్ ఫిక్స్  ఎనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరి వరుణ్ తేజ్ నటించిన గని థియేటర్స్ లోకి  ఎప్పుడు రానుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.