కలిసి డాన్స్ చేస్తున్న నాగార్జున, నాని

Friday,June 01,2018 - 11:03 by Z_CLU

వీళ్లిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికింకా పేరు పెట్టలేదు. షూటింగ్ మాత్రం ఫాస్ట్ గా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాల్లో నడుస్తోంది. నాగ్, నాని తో ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి బీట్ కు తగ్గట్టు స్టెప్పులేస్తున్నారు.

ఈ సాంగ్ కోసం అన్నపూర్ణలో భారీ సెట్ వేశారు. 2 రోజుల నుంచి నడుస్తున్న ఈ సాంగ్ షూటింగ్.. మరో 2 రోజులు కొనసాగుతుంది. రేపట్నుంచి ఇదే పాటకు సంబంధించి రెయిన్ ఎఫెక్ట్ లో షూటింగ్ ఉంటుంది. అంటే వానలో తడుస్తూ నాగ్, నాని డాన్స్ చేస్తారన్నమాట.

అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సినిమాలో నాగ్ సరనస ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.