జూన్ 2 నుండి తేజ్ I love u హంగామా షురూ

Friday,June 01,2018 - 12:03 by Z_CLU

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ I love u’.  జూన్ 29 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని ఈ నెల 2 నుండి బిగిన్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘అందమైన చందమామ’ రిలీజ్ చేయనున్న ఫిల్మ్ మేకర్స్, జూన్ 9 న ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది.

గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా K.S. రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకుడు.