నాగార్జున ఇంటర్వ్యూ

Tuesday,May 23,2017 - 04:05 by Z_CLU

నాగ చైతన్య-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ సినిమాకు నాగార్జున నిర్మాత. ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు నాగ్.

చాలా హ్యాపీ

ప్రస్తుతం రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఇంకో 3 రోజుల్లో సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలతో ఈ సినిమాను రూపొందించాం. ఇప్పటికే ఎడిటింగ్ రూమ్ లో చాలా సార్లు చూశాను.. నాకైతే బాగా నచ్చింది. చాలా హ్యాపీ గా ఉంది.

నేను కండక్టర్ మాత్రమే…

నిజానికి ఈ సినిమా విషయంలో టీం సపోర్ట్ చాలా ఉంది. అందరు తమ సినిమాగా భావించి వాళ్ళ పూర్తి ఎఫర్ట్ పెట్టి ఒక గుడ్ సినిమా గా తీర్చిదిద్దారు. కళ్యాణ్ కృష్ణ సినిమాను రూపొందించిన విధానం, దేవి మ్యూజిక్ , సత్యానంద్ గారు స్క్రిప్ట్- స్క్రీన్ ప్లే చూసుకోవడం సజెషన్స్ ఇవ్వడం ఇలా సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరు వాళ్ళ 100 % ఎఫర్ట్ పెట్టి సినిమాను ఈ రేంజ్ కి తీసుకొచ్చారు.. సో నేను కేవలం వీళ్ళందరికీ ఒక కండక్టర్ లా పనిచేశానంతే.


ఫుల్ కాన్ఫిడెంట్

నిజానికి ఈ సినిమాపై నిర్మాతగానే కాకూండా చైతూకి నాన్నగా కూడా కాన్ఫిడెంట్ తో ఉన్నాను. సినిమాలో చైతూ-రకుల్ కెమిస్ట్రీ వాళ్ళ మధ్య వచ్చే సీన్స్, చైతూకి జగపతి బాబు కి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ఫామిలీ సీన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇలా అన్ని కలగలిపిన ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నా.. ఆ నమ్మకంతోనే “26 కి వస్తున్నాం కొడుతున్నాం” అని ఆడియో వేడుకలో ఫాన్స్ తో గట్టిగా చెప్పాను.

ఆ ఫ్లేవర్ తో ఉంటుంది..

ఈ సినిమా కథ వింటున్నప్పుడే నిన్నే పెళ్లాడతా ఫ్లేవర్ లో ఉంటూ ఫ్రెష్ గా ఎంటర్టైన్ చేయాలనీ అందరం అనుకున్నాం.. చాలా మంది ఆ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. నిన్నేపెళ్లాడతా ఫ్లేవర్ ఉంటుంది కానీ కథకి ఏమాత్రం సంబంధం లేదు. సినిమా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా అందరినీ ఎట్రాక్ట్ చేసేలా ఉంటుంది..

చైతులో ఆ తేడా కనిపిస్తుంది

ఈ సినిమాలో చైతూ చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపిస్తాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి మార్కులు అందుకుంటున్నాడు. మొన్న ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా కనిపించి ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమాలో కంప్లీట్ గా కొత్తగా కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తాడు. సినిమా చూస్తే చైతూలో ఆ తేడా బాగా కనిపిస్తుంది.

బహుశా కారణాలు అవేనేమో

ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా చూస్తుంటే చైతు లో ఈజ్ కనిపించింది. చాలా సూట్ గా సింపుల్ గా హ్యాపీ నెస్ తో నటించాడు.. బహుశా లవ్ లో హ్యాపీగా ఉన్నాడు కదా సమంత ప్రమేయం ఉండొచ్చు. ఈ మధ్యనే 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాడు సో బహుశా ఇంత ఈజ్ గా నటించడానికి ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి వయసుతో వచ్చిన మెచ్యూరిటీ కూడా కారణాలేమో.

ఆ రోల్ కి ఇంకా టైం ఉంది

సినిమాలో జగపతి బాబు-చైతూ మధ్య వచ్చే సీన్స్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు అన్ని నేను, చైతు రియల్ లైఫ్ లో ఎలా ఉంటామో అలాగే ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు దించేశాం. ఇక స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే ఫాదర్ రోల్ మీరే చేసెయ్యండి బాగుంటుంది అన్నారు. మొన్న అఖిల్ కి కూడా ఫాదర్ గా చేసెయ్యండి అన్నారు. ఫాదర్ రోల్స్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడే ఫాదర్ అయిపోతే ఎలా(నవ్వుతూ)..

రకుల్ ని చూస్తే వాళ్ళు గుర్తొస్తారు

ఈ సినిమాలో రకుల్ చాలా డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ గా కనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ లో రకుల్ ని చూస్తే శ్రీదేవి, టబు గుర్తొస్తారు.


అప్పుడే నేర్చేసుకున్నా

ఒక నిర్మాతగా కంటెంట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి.. ఎంత ఖర్చు పెట్టాలి. ప్రొడక్షన్ ఎలా చూసుకోవాలి అనే విషయాలన్నీ నాన్నగారు నిర్మాతగా చేసినప్పుడే నేర్చేసుకున్నా. సో నిర్మాతగా ఏదైనా సినిమా తీసినప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించదు.. ఈ సినిమా విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్మాతగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నిర్మించా.

నిర్మాతగా ఆ జాగ్రత్త ఉండాల్సిందే

నిజానికి నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహిస్తూ అన్ని చూసుకుంటూ ఉండాలి. కాస్త ఫోకస్ షిఫ్ట్ చేస్తే ప్రాజెక్ట్ ట్రాక్ తప్పే అవకాశాలున్నాయి. భాయ్ టైం లో కాస్త బిజినెస్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఈ సినిమా విషయంలో నిర్మాతగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫోకస్ పెట్టాను.

ఆ సినిమాకి ఇంకా కథ లేదు

సోగ్గాడే చిన్ని నాయన తర్వాత ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన కథ ఇంకా సెట్ అవ్వలేదు. త్వరలోనే బంగార్రాజు స్టోరీ డిస్కషన్స్ చేయాలి.

అది కుదరదు

నిజానికి చైతు-అఖిల్ బయట ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోను. కేవలం కథ మాత్రమే వింటానంతే.. ఒక్కో సారి అలా తీసి ఉంటె బాగుండేది అని జస్ట్ మనసులో అనుకుంటా.. అయినా వాళ్ళు నటించే అన్ని సినిమాలు నేను ప్రొడ్యూస్ చేయలేను కదా.. ఏడాదికో సినిమా అంటే ఒక కానీ ఇంకా ఎక్కువ చెయ్యాలంటే అది కుదరదు. సో ప్రెజెంట్ చైతు- అఖిల్ మా బ్యానర్ లో నటిస్తున్న రెండు సినిమాల విషయం లో నిర్మాతగానే కాకుండా తండ్రి గా కూడా కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నా..

అప్పటి నుంచే మా మధ్య ఆ అనుబంధం 

రీసెంట్ గా సమంత నేను చాట్ చేసిన విషయాన్నీ సోషల్ మీడియాలో పెట్టాను. మా మధ్య ఇలాంటి జోక్స్ ఉంటాయా అని కొందరు షాక్ అయ్యారు. నిజానికి మనం సినిమా నుంచే సమంత నాకు బాగా క్లోజ్… కానీ అప్పుడు సర్ అనేది ఇప్పుడు మామ అని పిలుస్తుంది అంతే తేడా. మామయ్య అంటే మరీ ఓల్డ్ గా ఉంటుందని మామ అని పిలుస్తోంది. మేము ఎపుడు అలాగే జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉంటాం.

నిజంగా నాకు తెలియదు

విక్రమ్ రిలీజ్ అయి ఈరోజుకి 31 ఏళ్ళు అయిందని నాకు తెలియదు.. మనం, అన్నమయ్య కూడా ఈ నెలలోనే రిలీజ్ అయిందని విన్నాను. సో.. మే నెల మాకు చాలా లక్కీ అన్నమాట..


ఇప్పుడే వద్దని చెప్పా

చైతు -అఖిల్ కి ప్రొడక్షన్ సైడ్ ఇప్పుడే వెళ్లొద్దని చెప్పా.. కేవలం యాక్టింగ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టమని చెప్పా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చూసుకోమని మాత్రం చెప్తా. సో ఇప్పుడే అటు వైపు వెళ్తే ఫోకస్ షిఫ్ట్ అయి యాక్టింగ్ కెరీర్ కి మైనస్ అవుతుందని నా ఫీలింగ్..

 

మహాభరతంలో కర్ణుడిగా చేయమన్నారు

మళయాలంలో తెరకెక్కనున్న ‘మహాభారతం’ సినిమాలో కర్ణుడి క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని అడిగారు. సో చేయడానికి నేను రెడీ నే.. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అన్ని సెట్ అయి ఆ సినిమా సెట్స్ పైకి వస్తే కర్ణుడిగా కనిపించడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు..

 

అఖిల్ సినిమాలో అది పూర్తయింది

ప్రెజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కి సంబంధించి యాక్షన్ పార్ట్ పూర్తయింది.. త్వరలోనే మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. హీరోయిన్ గా ఇప్పటికే అనుకున్న నలుగురు కొత్తమ్మాయిల నుంచి ఒకర్ని ఫైనల్ చేయాలి. ఓ నాలుగు టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నాం. కానీ కచ్చితంగా ఓ తెలుగు టైటిల్ పెట్టాలనుకుంటున్నాం.

అవన్నీ రూమర్లే

ప్రస్తుతానికి నేను నటిస్తున్న రాజుగారి గది-2 సినిమా 10 రోజుల మినహా షూటింగ్ పూర్తయింది. సినిమా చూసాకే ఆ పది రోజుల షూటింగ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాం. ఇక నాని తో మల్టీ స్టారర్ చేస్తున్నానని మరో సినిమా ఏదో స్టార్ట్ చేస్తున్నానని వార్తలన్నీ రూమర్లే.. నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదు. అవ్వగానే అనౌన్స్ చేస్తా.