గ్రాండ్ గా ఫ్యాషన్ డిజైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,May 23,2017 - 05:07 by Z_CLU

సీనియర్ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఫ్యాషన్ డిజైనర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. 30 ఏళ్ల క్రితం రిలీజై హిస్టరీ క్రియేట్ చేసిన, ‘లేడీస్ టైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా జూన్ 2 న రిలీజ్ అవుతుంది.

 

తన సినిమాలోనే బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకునే వంశీ గారు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ‘ఫ్యాషన్ అంటే ఏమిటీ..?’ అనే వెరైటీ థీమ్ తో ఫన్ లోడెడ్ ఈవెంట్ గా డిజైన్ చేశారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా, లేడీస్ టైలర్ లాగే, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.