విజయ్ దేవరకొండ సినిమాలో రాశిఖన్నా

Tuesday,August 14,2018 - 07:45 by Z_CLU

రేపు విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ గ్రాండ్ గా రిలీజవుతుంది. మరోవైపు ‘ట్యాక్సీవాలా’ ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇంకో వైపు ‘నోటా’ తో పాటు మరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ  సినిమాలతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు విజయ్.  ప్రస్తుతం ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా ఫిక్సయిందని తెలుస్తుంది.

తొలిప్రేమ సినిమాతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ రాశిఖన్నా రీసెంట్ గా రిలీజైన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో మరో సక్సెస్ ని అందుకుంది. అయితే ఈ  స్పీడ్ లో ఆచితూచి సినిమాలను చూజ్ చేసుకుంటున్న రాశిఖన్నా, ఈ సినిమాకి మ్యాగ్జిమం ఫిక్సయినట్టే అని సమాచారం.  

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాని K.S. రామారావు నిర్మిస్తున్నాడు. అక్టోబర్ కల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్న ఫిలిమ్ మేకర్స్, ఈ సినిమాకి సంబంధించిన తక్కిన డీటేల్స్ ని త్వరలో అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.