NTR – ఇండిపెండెన్స్ డే కానుక

Tuesday,August 14,2018 - 05:43 by Z_CLU

ఇండిపెండెన్స్ డే సందర్భంగా NTR బయోపిక్ లోని మరో ఇంట్రెస్టింగ్ లుక్స్ ని రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్. NTR పొలిటికల్ కరియర్ లో హయ్యెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కాషాయ దుస్తుల్లో బాలయ్య, అచ్చం NTR లాగే కనిపిస్తున్నాడు.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది NTR బయోపిక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో NTR పర్సనల్ లైఫ్ తో పాటు అటు పొలిటికల్, సినిమా కరియర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని గ్రాండియర్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

బాలీవుడ్ నటి విద్యాబాలన్, బసవ తారకం రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో చంద్రబాబులా రానా కనిపించనున్నాడు. కీరవాణి మ్యూజిక్ కంపోజర్. బాలయ్య తో పాటు సాయి కొర్రపాటి, విష్ణువర్ధన్ ఇందూరి ,  M.R. V. ప్రసాద్  సంయుక్తంగా  ఈ సినిమాని నిర్మిస్తున్నారు.