యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్

Tuesday,August 01,2017 - 12:34 by Z_CLU

నాగచైతన్య అప్ కమింగ్ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. యుద్ధం శరణం మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 10లక్షల వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాదు, ట్రెండింగ్ లో కూడా నంబర్ వన్ గా నిలిచింది.

రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ తర్వాత చైతూ నుంచి వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. కృష్ణ మరిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించాడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా నటించిన శ్రీకాంత్, మళ్లీ ఇన్ని దశాబ్దాలకు ఈ సినిమాతో విలన్ గా లక్ చెక్ చేసుకుంటున్నాడు. సినిమాపై బజ్ క్రియేట్ అవ్వడానికి ఇది కూడా ఓ కారణం.