బన్నీతో నాని హీరోయిన్

Sunday,July 02,2017 - 12:10 by Z_CLU

‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ‘నా పేరు సూర్య’ ను త్వరలోనే సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తుంది.


నాని నటించిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అను.. ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాలో  నటిస్తోంది. ఈ అమ్మడు బన్నీ సరసన పర్ఫెక్ట్ జోడీ అని భావిస్తున్నారట మేకర్స్. అల్లు అర్జున్ కూడా ఈ భామకే వోట్ వేసినట్లు సమాచారం.