నా పేరు సూర్య – హైలెట్ ఆల్సో

Monday,April 30,2018 - 08:04 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మానియా కనిపిస్తుంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తరవాత ఈ సినిమా చుట్టూ మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ జెనెరేట్ అవుతున్నాయి. దానికి తోడు ఈ రోజు రిలీజైన ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ ప్రోమో, ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అనే రేంజ్ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది.

పాప్యులర్ హాలీవుడ్ మూవీ ‘ద మూవీ హీరో’, ‘ద రీపర్’ లాంటి పాప్యులర్ సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ ‘జోసెఫ్ లబిసి’ ఈ సినిమాకు పని చేశాడు. అరియానా గ్రాండీ, ఎనరిక్ ఇగ్లెషియస్, నిక్కీ మినాజ్ లాంటి పాప్యులర్ స్టార్స్ కి పై చేసిన ఈ సినిమాటోగ్రాఫర్ స్టాండర్డ్స్ ప్రతి ఫ్రేమ్ లో ఎలివేట్ అవుతున్నాయి. దానికి తోడు ఈ సాంగ్ లో మరో హైలెట్ ఉంది.

జెన్నీఫర్ లోపెజ్, నిక్కీ మినాజ్ లాంటి వరల్డ్ పాప్యులర్ పాప్ సింగర్స్ కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ‘ఏన్ మేరీ హోయాంగ్’ ఈ సాంగ్ కోసం స్పెషల్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. దాంతో ఈ సాంగ్ కంప్లీట్ గా హాలీవుడ్ స్టైల్ లో మెస్మరైజ్ చేస్తుంది. ఈ సాంగ్  లో బన్ని క్యాప్ తో చేసే ట్రిక్కీ స్టెప్స్ సాంగ్ లో మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి.