నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కొరటాల

Monday,April 30,2018 - 07:40 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘భరత్ అనే నేను’. ఈ సినిమా రిలీజయి ఫస్ట్ వీక్ క్రాస్ అయిన, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ లో ఇంకా స్పీడ్ తగ్గలేదు. అయితే టాలీవుడ్ లో అప్పుడే కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా విషయంలో క్యూరియాసిటీ బిగిన్ అయిపోయింది. అయితే ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు.

ప్రస్తుతానికి కంప్లీట్ గా బ్రేక్ మోడ్ లో ఉన్నానని కన్ఫం చేసిన ఈ కమర్షియల్ డైరెక్టర్, ప్రస్తుతం 2 నెలల ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ లో ఉన్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, ఆ వెకేషన్ తరవాతే ఏదైనా ఆలోచిస్తానని రీసెంట్ గా జరిగిన భరత్ అనే నేను సక్సెస్ మీట్ లో చెప్పుకున్నాడు.

ఇక ఫ్యూచర్ లో రామ్ చరణ్ తో సినిమా కంపల్సరీగా ఉంటుందని కన్ఫం చేసిన కొరటాల, చెర్రీ కమిట్ అయిన 2 సినిమాల తరవాత ఇమ్మీడియట్ గా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పాడు. అయితే ఈ గ్యాప్ లో కొరటాల తో సెట్స్ పైకి  రానున్న స్టార్ ఎవరా అనే క్వశ్చన్, ఫ్యాన్స్ లో జెనెరేట్ అవుతుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరకాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.