మామ్ ట్రైలర్ కి 3 మిలియన్ వ్యూస్

Monday,June 05,2017 - 06:00 by Z_CLU

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ బ్యానర్స్ పై ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘మామ్‌’. నటిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న తరుణంలో శ్రీదేవి నటిస్తున్న 300వ సినిమాగా తెరకెక్కుతున్న ‘మామ్’ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ భారీ అంచనాలను నెలకొల్పుతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ సినిమా అంచనాలను నెలకొల్పింది.


జూన్ 3 విడుదలైన ఈ ట్రైలర్ లేటెస్ట్ గా 3 మిలియన్ వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డు సాధించింది. బోనీకపూర్‌ నిర్మాణంలో రూపొందుతున్నఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, సజల్‌ ఆలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు తమిళ్,తమిళ్, మలయాళం,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూలై 7 థియేటర్స్ లో సందడి చేయనుంది.