MLA సినిమా ప్రారంభం

Monday,June 05,2017 - 05:00 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ ఎట్టకేలకి నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేశాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇజం’ సినిమా తర్వాత హీరోగా కాస్త గ్యాప్ తీసుకొని నిర్మాతగా ఎన్టీఆర్ సినిమాతో బిజీ గా మారిన కళ్యాణ్ రామ్ ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎం.ఎల్.ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయి)’ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు.

లేటెస్ట్ గా ఇజం సినిమాలో స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేసిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మరింత స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తాడట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించనుంది. ఉపేంద్ర దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 9 నుంచి సెట్స్ పై వెళ్లబోతుంది.