'సాహో' లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా..

Sunday,June 11,2017 - 01:00 by Z_CLU

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సాహో’ . ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా లేటెస్ట్ గా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ లిస్ట్ లో చాలా మంది పేర్లు వినిపించగా  సినిమాలో పూజా హెగ్డే ను ఫైనల్ చేశారనే వార్త చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో మరో పేరు చేరింది. మల్లూ బ్యూటీ మంజిమ మోహన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించనుందని, తాజాగా మేకర్స్ ఈ భామను సంప్రదించి హీరోయిన్ గా ఫైనల్ చేసారనే టాక్ టాలీవుడ్ సర్కిల్ తో పాటు సోషల్ మీడియా లో కూడా హల్చల్ చేస్తుంది.