సురేందర్ రెడ్డికి కలిసొస్తున్న మెగా ఫ్యామిలీ

Wednesday,September 04,2019 - 11:02 by Z_CLU

మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘సైరా’. ఈ సినిమా చేయాలనేది చిరంజీవి ఎప్పటి నుండో కంటున్న కల. అలాంటిది ఇన్నాళ్ళకు అది పాసిబుల్ అయింది. ఇక డైరెక్షన్ వరకు వచ్చేసరికి టాలీవుడ్ లో ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా, ఈ చాన్స్ మాత్రం ఏరికోరి సురేందర్ రెడ్డి కే దక్కింది. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఈ మాసివ్ డైరెక్టర్ కి అలా కలిసొస్తుంది మరీ…

ఈ డైరెక్టర్ కరియర్ లో హిట్స్, ఫ్లాప్స్ ఈక్వల్ రేషియోలో ఉన్నాయి కానీ.. అదేంటో మెగా హీరోస్ విషయంలో సురేందర్ రెడ్డికి ఇప్పటి వరకు డిజప్పాయింట్ మెంట్ లేదు. ఇప్పటి వరకు ఏ మెగా హీరోకి యాక్షన్ చెప్పినా బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అనిపించుకున్నాడు.

బన్ని ‘రేసుగుర్రం’ తో మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టిన సురేందర్ రెడ్డి ఈ సినిమాతోనే ఇంప్రెషన్ కొట్టేశాడు. ఈ సినిమాకి ఇప్పటికీ బన్ని ఫిల్మోగ్రఫీ లో ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఓ రకంగా రామ్ చరణ్ ‘ధృవ’ కి సురేందర్ రెడ్డిని ప్రిఫర్ చేయడానికి ఈ సినిమా సక్సెసే రీజన్… రామ్ చరణ్ స్టైలిష్ మ్యానరిజాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు సురేందర్ రెడ్డి. అందుకే ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ‘సైరా’ ని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు.

వైబ్స్ చూస్తుంటే సురేందర్ రెడ్డికి మెగా సెంటిమెంట్ 100% వర్కవుట్ అవుతుందనే అనిపిస్తుంది. ఇద్దరు మెగా హీరోలతో బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటాడనే అనిపిస్తుంది.