మెగా స్టామినా....

Tuesday,October 18,2016 - 12:46 by Z_CLU

ఒక్క ఫ్లాప్ వస్తే భయపడే ఫ్యామిలీ కాదు. నిజానికి ఫ్లాపులతో సంబంధం లేని కాంపౌండ్ అది. ఆ కాంపౌండ్ లో హీరో ఎవరైనా, అతడికి ఎన్ని పరాజయాలు ఎదురైనా,… మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్, ప్రేక్షకుల్లో ఎనలేని ప్రేమ ఉంటూనే ఉంటాయి. ఆ కాంపౌండ్ ఏదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హయ్యస్ట్ హీరోస్ ఉన్న ఆ ఏకైక డెస్టినేషన్ మెగా కాంపౌండ్. ఇప్పుడీ స్టామినాను చెర్రీ మరోసారి రుజువు చేస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విమర్శలు వచ్చినప్పటికీ… మెగాస్టార్ రేంజ్ లో నిలదొొక్కుకోవడానికి చెర్రీ చాలా కష్టపడుతూనే ఉన్నాడు.  ఇందులో భాగంగా… రిలీజ్ కాకుండానే ధృవ సినిమాతో తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. తనకున్న మాస్ ఫాలోయింగ్ తిరుగులేనిదని నిరూపిస్తున్నాడు.

dhruva

     ధృవ సినిమా కోసం ఆడియన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో… సోషల్ మీడియాలో  ఆ సినిమా హంగామా చూస్తే అర్థమైపోతుంది. 2 మిలియన్ వ్యూస్ సాధించిందని గొప్పగా చెప్పుకునే లోపే… ధృవ టీజర్ 3 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 30లక్షల మంది ఈ టీజర్ ను చూశారంటే… ధృవ కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతోంది. చరణ్ విషయంలోనే కాదు., ఏ మెగా హీరోకైనా ప్రేక్షకుల్లో ఆ క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది.