ఎల్లుండి నుండి....

Tuesday,October 18,2016 - 12:41 by Z_CLU

దువ్వాడ జగన్నాథం దుమ్ము రేపడానికి రెడీ అయిపోయాడు. సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం టైం తీసుకున్నట్టు మనకు అనిపించినా బన్నీ మాత్రం DJ సినిమాలో తన క్యారెక్టర్ కు తగ్గట్టు మేకోవర్ చేసుకోవడం కోసమే ఈ చిన్న గ్యాప్ తీసుకున్నాడు.

DJ ప్రీ ప్రొడక్షన్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసిన యూనిట్ ఎల్లుండి నుండి యాక్షన్ లోకి దిగుతుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తాడు.

allu-arjun-dj-movie-opening-stills-02

ఫిబ్రవరి నాటికి షూటింగ్ ముగించుకుని 2017 మార్చి లేదా ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే మ్యూజిక్ కంపోజిషన్ ప్రారంభించాడు.