పవన్ కళ్యాణ్ తో మెగా సిస్టర్

Friday,December 30,2016 - 04:00 by Z_CLU

గతంలో స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ గా చేసిన ఖుష్బూ, ఇప్పుడు తమ్ముడు సినిమాకి కూడా సంతకం చేసేసింది. ఆ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేసింది.  

ఈ సినిమాలో ఖుష్బూ చేయబోయే క్యారెక్టర్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబో లో తెరకెక్కనున్న సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది ఖుష్బూ.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని త్రివిక్రమ్ ఏ మాత్రం డిలేస్ కి ఛాన్స్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు.