మిస్సింగ్ డైరెక్టర్స్ -2016

Friday,December 30,2016 - 03:03 by Z_CLU

  టాలీవుడ్ డైరెక్ట్సర్ కొందరు తమ  క్యాలెండర్ నుంచి ఓ ఇయర్ ను మిస్ అయిపోయారు. ప్రతీ ఏడాది తమ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ను  ఎంటర్టైన్ చేసే డైరెక్టర్స్ లో కొందరు ఈ ఇయర్ మాత్రం తమ సినిమాలతో థియేటర్స్ లో అడుగుపెట్టలేకపోయారు. అలా 2016 లో మిస్ అయిన దర్శకులెవరో? ఓ లుక్కేద్దాం…

rajamouli

టాలీవుడ్ ఈ ఇయర్ ఓ డైరెక్టర్ ను మిస్ అయ్యిందనేకంటే మరో ఇండస్ట్రీ హిట్ మిస్ అయ్యిందని చెప్పడం కరెక్ట్. అవును ఈ ఇయర్  టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా రాకపోవడం టాలీవుడ్ కు  కాస్త మైనస్. 2015 లో బాహుబలి సినిమా  తెలుగు సినిమా సత్తా చాటి భారీ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రెజెంట్ ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు జక్కన్న. ఈ  భారీ బడ్జెట్ సినిమా  కోసం స్పెషల్ కేర్ తీసుకుంటూ ఈ ఏడాది ను మిస్ అయిపోయాడు. ఈ ఇయర్ మిస్ అయినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం ‘బాహుబలి-2 ‘ తో బాక్సాఫీస్ దగ్గర భారీ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి.

director-v-v-vinayak-photos-011

ఈ ఇయర్ ను మిస్ అయిన స్టార్ డైరెక్టర్ లో వినాయక్ కూడా ఉన్నాడు. గతేడాది అఖిల్ ను హీరో గా పరిచయం చేసి ‘అఖిల్’ సినిమాతో థియేటర్స్ లో అడుగుపెట్టిన వినాయక్ ఈ ఏడాది మెగా స్టార్ పిలిచి మరీ తన ప్రతిష్టాత్మక 150 సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వడం తో ఈ ఇయర్ ఫోకస్ అంతా ఈ సినిమా పైనే పెట్టి 2016 ను మిస్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ ఇయర్ మిస్ అయినా వచ్చే ఏడాది ఆరంభం లోనే  ‘ఖైదీ నంబర్ 150 ‘ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు వినాయక్.

sreenu-vaitla

ప్రతీ ఏడాది ఓ స్టార్ హీరో తో థియేటర్స్ లో సందడి చేస్తూ వస్తున్న స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా ఈ ఇయర్ ను మిస్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ సినిమాను తెరకెక్కించిన వైట్ల ఈ ఇయర్ సగభాగం నెక్స్ట్ సినిమా పై దృష్టి పెట్టి ఆ సినిమాను స్టార్ట్ చేయడానికి మరి కొంత టైం తీసుకొని 2016 ను మిస్ అయ్యాడు. ప్రెజెంట్ వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’ సినిమా ను తెరకెక్కిస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఆ సినిమాతో 2017 లో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.

guna-shekar

2016 లో నెక్స్ట్ సినిమా కథ తోనే గడిపేశాడు గుణ శేఖర్. గతేడాది అనుష్క-అల్లు అర్జున్-రానా లతో చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’తో థియేటర్స్ లో సందడి చేసిన గుణ ఈ ఇయర్ ఆ సినిమా సీక్వెల్ కథ అలాగే మరో కథ తో ఫుల్ బిజీ గడిపేశాడు.

Director Krish at Krishnam Vande Jagadgurum Working Stills

విభిన్న సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేసే క్రిష్ నుంచి కూడా ఈ ఏడాది సినిమా రాలేదు. గతేడాది ‘కంచె’ తో గట్టి గా సందడి చేసి నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ డైరెక్టర్  2016  అంతా నందమూరి బాలకృష్ణ ప్రతిషాత్మక సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాతోనే గడిపేశాడు. గౌతమి పుత్ర శాతకర్ణి బయోపిక్ , పైగా బాలకృష్ణ నటిస్తున్న 100 సినిమా కావడం తో తన క్యాలెండర్ లో నుంచి ఓ ఇయర్ ను ఈ సినిమా కోసం డేడికేట్ చేసాడు క్రిష్.

dolly

లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్-వెంకటేష్ లతో మల్టీ స్టారర్ తెరకెక్కించి  ‘గోపాల గోపాల’ లతో థియేటర్స్ లో సందడి చేసి సూపర్ హిట్ అందుకున్న కిషోర్ కుమార్ పార్దాసాని (డాలీ) కూడా ఈ ఇయర్ మిస్ అయ్యాడు. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ తో ‘కాటమరాయుడు’ తెర కెక్కిస్తూ ఈ సినిమా షూటింగ్ తోనే ఈ ఏడాది గడిపేశాడు డాలీ.

shekar-kammula

శేఖర్ కమ్ముల సినిమాకు సెపరేట్ ఆడియన్స్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే ఈ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఇయర్ కూడా  టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాలేక పోయాడు. 2014  లో  ‘అనామిక’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ప్రెజెంట్ వరుణ్ తేజ్-సాయి పల్లవి లతో ‘ఫిదా’ సినిమాను తెరకెక్కిస్తూ  నెక్స్ట్ ఇయర్ టాలీవుడ్ ఆడియన్స్ మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ‘ఫిదా’ చేయడానికి రెడీ అవుతున్నాడు.

sampath-nandi

లాస్ట్ ఇయర్ ‘బెంగాల్ టైగర్’ సినిమా తో తెలుగు ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసిన సంపత్ నంది ఈ ఇయర్ మిస్ అయ్యాడు. ప్రెజెంట్ గోపి చంద్ తో సినిమాను తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఇయర్ పై పూర్తి ఫోకస్ పెట్టి మరో సారి ఎంటర్టైన్ చేసి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు .

gopichand-malineni

2015 లో ‘పండగ చేస్కో’ సినిమాతో థియేటర్స్ లో పండగ తీసుకొచ్చిన డైరెక్టర్ గోపి చంద్ మలినేని కూడా ఈ ఏడాది మిస్ అయ్యాడు. ఈ ఏడాది లో కథ కోసమే కొన్ని నెలలు గడిపేసిన ఈ డైరెక్టర్ ప్రెజెంట్ సాయిధరమ్ తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ లతో ‘విన్నర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2017 ఫిబ్రవరి 14 విడుదల కానుంది.

palnati-surya-pratap-photos-27

లాస్ట్ ఇయర్ యూత్ ఫుల్ బోల్డ్ సినిమా ‘కుమారి 21 ఎఫ్’  తో బాగా సందడి చేసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ కూడా 2016 ఇయర్ ను మిస్ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్ లోనే మరో సినిమాను డైరెక్ట్ చేయబోతున్న ఈ డైరెక్టర్ 2017 లో మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

kranthi-madhav

గతేడాది మంచి సినిమాగా పేరొందిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ దర్శకుడు క్రాంతి మాధవ్ కూడా తన క్యాలెండర్ నుంచి ఈ ఏడాది ను మిస్ అయ్యాడు. ఈ సినిమా తో టాలీవుడ్ ఆడియన్స్ కు సరి కొత్త ప్రేమ కథను చూపించి ఫీల్ గుడ్ మూవీ అందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం సునీల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తూ ఆ సినిమాతో నెక్స్ట్ ఇయర్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.

Director Trinadha Rao Nakkina at Priyathama Neevachata Kusalama Platinum Disc Function Photos

‘సినిమా చూపిస్తా మావ’ తో లాస్ట్ ఇయర్  సూపర్ హిట్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర హిట్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న త్రినాధ్ రావు నక్కిన  నాని కోసం 2016 ను  డేడికేట్ చేసి ఈ ఏడాది మిస్ అయ్యాడు. ప్రెజెంట్ నాని తో నేను లోకల్’ సినిమా తెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్ ఈ సినిమాతో వచ్చే ఏడాది థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు .

omkar-1

లాస్ట్ ఇయర్ ‘రాజు గారి గది’ అనే  చిన్న సినిమాతో పెద్ద విజయం అందుకున్న దర్శకుడు ఓంకార్ కూడా 2016  కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఇయర్ మిస్ అయినప్పటికీ నెక్స్ట్ ఇయర్  మాత్రం కింగ్ నాగ్ తో గ్రాండ్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు.

sudheer-varma-1

ఇక ఈ ఇయర్ కథ తోనే గడిపేసిన డైరెక్టర్స్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కూడా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ‘దోచేయ్’ సినిమా తో ఎంటర్టైన్ చేసిన ఈ డైరెక్టర్ 2016 లో కథ కోసం కొన్ని నెలలు, షూటింగ్ కోసం మరి కొన్ని నెలలు తీసుకొని నెక్స్ట్ ఇయర్ నిఖిల్ తో ఎంటర్టైన్ చేయడానికి ప్లాన్ చేసాడు.

sreeram-adithya

ఇక 2016 ను మిస్ అయిన యంగ్ డైరెక్టర్స్ లో శ్రీరామ్ ఆదిత్య కూడా ఒకరు. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ‘భలే మంచి రోజు’ సినిమాతో బాగానే సౌండ్ చేసాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఈ ఇయర్ కూడా అదరగొడతాడనుకుంటే కాస్త గ్యాప్ తీసుకొని నెక్స్ట్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఓ యంగ్ హీరో కోసం కథ రెడీ చేసిన ఈ డైరెక్టర్ ఆ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు.

ఇలా 2016 లో కొందరు  స్టార్ డైరెక్టర్స్ నుండి యంగ్ డైరెక్టర్ వరకూ థియేటర్స్ లో సందడి  చేయలేకపోయారు. మరి 2017 లో వీరు ఈ  గ్యాప్ ని హిట్స్ తో కవర్ చేస్తారేమో? చూడాలి…