చిరంజీవి ‘సైరా’ లో అత్యద్భుతం అదే...

Friday,March 30,2018 - 12:45 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ మెగాస్టార్ ‘సైరా’. ప్రస్తుతం ఈ సినిమాలోని అత్యద్భుత దృశ్యం తెరకెక్కుతుంది. హిస్టారికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పెళ్ళి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్, స్వయంగా ఈ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గెటప్ లో మెగాస్టార్ అదిరిపోయాడు. పెళ్ళి కూతురుగా నయనతార ఎప్పటిలాగే తన క్యారెక్టర్ లో ఒందికగా ఒదిగిపోయిందనిపిస్తుంది. సినిమాలో  హై  ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న  ఈ సన్నివేశాల కోసం, హైదరాబాద్  లో భారీ  సెట్ నిర్మించారు.   అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ చిరంజీవికి గురువుగా నటిస్తున్నారు.

 

ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు తన అనుభవాల్ని షేర్ చేసుకుంటున్న బిగ్ బి, మెగాస్టార్ తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది సైరా. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.