ప్రభాస్ తో సినిమా ... మారుతి క్లారిటీ !

Monday,June 27,2022 - 12:20 by Z_CLU

Director Maruthi clarity on with Prabhas Movie

ప్రభాస్ తో మారుతి సినిమా ఎలా ఉండబోతుంది ?

వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా జోనర్ ఏంటి ?

అసలు  సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది ?

ఈ ప్రశ్నలకు తాజాగా ఆన్సర్ ఇస్తూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం గోపీచంద్ తో మారుతి తీసిన ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా మారుతి మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ తో సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ప్రభాస్ ని ఎలా చూపించాలో నాకు ఓ ఐడియా ఉంది అలానే చూపిస్తూ సినిమా చేస్తాను. జోనర్ తో పాటు టైటిల్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమా కూడా వాళ్ళే తీసేస్తే బాగుంటుంది(నవ్వుతూ). నేను ఏ తరహా సినిమా చేస్తానో దాని కోసమే అప్రోచ్ అయినప్పుడు అలాంటి సినిమానే చేస్తాను. ఎగ్జాంపుల్ కి నేను నాటుకోడి బాగా చేస్తానని ఒకరు నన్ను అది వండమంటే నేను అదే వండాలి తప్ప  చైనీస్ ట్రై చేస్తాను అంటే కుదరదు కదా. ప్రభాస్ తో చేయబోయే సినిమా నా సినిమాల తరహాలోనే ఉంటుంది కానీ పాన్ ఇండియా స్కేల్ లో ఉంటుంది.  ప్రభాస్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారో సరిగ్గా అలానే చూపించే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే మా కాంబో సినిమా ఉంటుంది. ” అంటూ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మారుతి.

ఇక ఇదే ఇంటర్వ్యూలో మెగా స్టార్ తో చేయబోయే సినిమా గురించి కూడా చెప్పాడు మారుతి. చిరంజీవి గారితో చాలా ఏళ్ల నుండి అనుబంధం ఉందని యూవీ క్రియేషన్స్ విక్కీ , నేను కలిసి చిరంజీవి గారితో ఓ సినిమా చేయాలని కొన్ని ఐడియాస్ ఆయనకి చెప్పామని నిన్న ఆయన మా కాంబో సినిమా ఎనౌన్స్ చేయడం సంతోషమని ఆయన సినిమాకు ఎప్పటి నుండో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే మా కాంబో సినిమా ఉంటుందని చెప్పుకున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics