Pakka Commercial డేట్ లాక్ చేసుకున్న గోపీచంద్

Thursday,March 31,2022 - 02:20 by Z_CLU

Gopichand, Maruthi’s ‘Pakka Commercial’ release date announced

మ్యచో స్టార్ గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బేనర్స్ పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా రూపొందుతున్న ఈ సినిమాను జులై 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ఇటివల విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ లాయర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. SKN సహ నిర్మాత‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బీజాయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics