గ్రాండ్ గా ప్రారంభమైన మణికర్నిక

Thursday,May 04,2017 - 07:30 by Z_CLU

క్రిష్-కంగనా రనౌత్ కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభమైంది. దీని పేరు మణికర్నిక. ఈరోజు ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. వారణాశిలోని గంగానదీ తీరాన కాశిఘాట్ వద్ద ఈ సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. నదీతీరాాన ఏర్పాటుచేసిన 20 అడుగుల మణికర్నిక చిత్రపటాన్ని హీరోయిన్ కంగన ఆవిష్కరించడంతో సినిమా ప్రారంభమైంది.

యుద్ధనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత గాథ ఆధారంగా రాబోతోంది మణికర్నిక సినిమా. చారిత్రక నేపథ్యంలో సినిమాలు తీయడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయాన్నందుకుంది.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్.. మణికర్నిక సినిమాకు స్టోరీ సమకూరుస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీతం అందించనుంది. ఒకేసారి తెలుగు-తమిళ-హిందీ భాషల్లో తెరకెక్కనుంది మణికర్నిక మూవీ. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ 1828లో వారణాసిలో జన్మించారు. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధాారంగా రాబోతున్న మణికర్నిక సినిమాను వారణాసిలో లాంచ్ చేశారు.