సోషల్ మీడియా లో గ్రాండ్ హిట్ ...

Sunday,October 16,2016 - 01:36 by Z_CLU

ఇటీవలే విభిన్న చిత్రాల దర్శకుడు రూపొందించిన ‘మనమంతా’ టాలీవుడ్ లో మంచి సినిమా గా పేరు తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా సంచలన విజయం సాధించింది, ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం అయిన వెంటనే ఈ సినిమాను సోషల్ మీడియాలో పెట్టారు. అలా యూట్యూబ్ లో పెట్టిన 3 రోజుల్లోనే 10 లక్షల వ్యూస్ అందుకుంది మనమంతా సినిమా. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరు అవాక్కవుతున్నారు. కొందరు వ్యక్తుల జీవితంలో జరిగిన కథాంశాలతో తెరకెక్కి వెండితెర పై ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ సినిమా… సోషల్ మీడియా లో మాత్రం గ్రాండ్ హిట్ సాధించింది..

చంద్రశేఖర్ ఏలేటి డైరక్ట్ చేసిన ఈ సినిమాను సాయి కొొర్రపాటి నిర్మించారు. మోహన్ లాల్, గౌతమి,  విశ్వాంత్, నైనా రావ్ కీలక పాత్రలు పోషించారు.