సూర్య సినిమాలో సూపర్ స్టార్ స్పెషల్ రోల్

Sunday,May 13,2018 - 12:20 by Z_CLU

ప్రస్తుతం NGK మూవీ తో సెట్స్ పై ఉన్న సూర్య…నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. ఇప్పటికే NGK సినిమాకు సంబంధించి షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసిన సూర్య నెక్స్ట్  కే.వి.ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నాడట.

అయితే మోహన్ లాల్ మలయాళం కాకుండా ఇతర భాషలో నటించినప్పుడు తనకంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్ అయితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ కాబట్టే ఒప్పుకున్నాడనే టాక్ ఉంది. సో  మోహన్ లాల్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే కచ్చితంగా క్యారెక్టర్ లో ఎంతో కొంత కొత్తదనం కనిపించి ఉండాలి.. మరి సూర్య సినిమాలో మోహన్ లాల్ ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తాడో..చూడాలి.