కళ్యాణ్ దేవ్ ఇంటర్వ్యూ

Wednesday,July 11,2018 - 07:44 by Z_CLU

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్ జంటగా నటించిన ‘విజేత’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. ఫస్ట్ సినిమానే అయినా అందరికీ డెఫ్ఫినేట్ గా కనెక్ట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ దేవ్ తనకు ఈ సినిమా అవకాశం వచ్చిన దగ్గర్నించి, ప్రమోషన్ ప్రాసెస్ వరకు జరిగిన ఇంట్రెస్టింగ్ జర్నీని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఆ విషయాలు మీకోసం…

చిన్నప్పటి నుండే…

యాక్టర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుండే ఉంది. బాలీవుడ్ లో కూడా గట్టిగా ట్రై చేశాను. రీసెంట్ గా ఒక అవకాశం వచ్చినట్టే వచ్చింది కానీ వర్కవుట్ కాలేదు…

ఎక్స్ పెక్ట్ చేయని ఆఫర్…

వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర 3 నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక సడెన్ గా రాకేశ్ శశి నాకీ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ వచ్చినప్పటి నుండి ఈ సినిమా గురించే తప్ప, ఫ్యూచర్ సినిమాల గురించి కానీ, ఫ్యూచర్ కరియర్ గురించి కానీ ఇంకా ఆలోచించలేదు.

అనుకున్నాను కానీ…

ఈ కథకు ముందు అసలు నేను కథలే వినలేదు. విన్న వెంటనే నచ్చినా, యస్ అనకుండా యింకా కొన్ని కథలు విని డిసైడ్ అవుదాము అనుకుంటూనే, చిరంజీవి గారికి లైన్ చెప్పాను.. ఆయన బావుంది అని కంప్లీట్ స్టోరీ విన్నారు… ఓకె అనేశారు…

ఆయన సజెషనే…

చిరంజీవి గారు ఈ సినిమాలో ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఫాదర్ క్యారెక్టర్ కి మురళీ శర్మ అయితే బావుంటుంది అని సజెస్ట్ చేశారు అంతే..

అదే రీజన్…

కథే రీజన్.. రాకేశ్ స్టోరీ చెప్పగానే అందరికీ కనెక్ట్ అవుతుందనిపించింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక అసలే రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరిగే కుర్రాడు.. ఫ్యామిలీ ఇమోషన్స్.. ఇలా వరసగా సినిమాలో ప్రతి ఎలిమెంట్ వినగానే నచ్చేసింది. దానికి తోడు చిరంజీవి గారు ఓకె అనగానే ఇంకా నా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.

అదే డిఫెరెన్స్…

ఈ సినిమా స్టోరీ పాతదే కానీ చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు. ఒక 2,3 ఎలిమెంట్స్ విపరీతంగా నచ్చేస్తాయి.  ఎక్స్ట్రా ఆర్డినరీ ఫైట్స్ లాంటివేవీ సినిమాలో ఉండవు.

 

సెకండ్ డే…

షూటింగ్ ఫస్ట్ డే అసలు నేనే ఇబ్బంది పడలేదు. దూరంగా కెమెరాలున్నాయి… నేను కారులోంచి దిగి నడుచుకుంటూ రావాలి.. చాలా కంఫర్ట్ గా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కానీ సెకండ్ డే…  అందరూ ఆర్టిస్టుల మధ్య 2 పేజీల డైలాగ్ చెప్పాలి.. చాలా నర్వస్ గా ఫీలయ్యాను… కానీ ఆ తరవాత అందరితో ఫ్రెండ్ షిప్ చేసి క్లోజ్ అయ్యా. ఆ తరవాత  ప్రాబ్లం అనిపించలేదు…

సాయి కొర్రపాటి గారు…

చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్.. సినిమాకి ఏదీ కావాలంటే అది టైమ్ కి అరేంజ్ చేశారు…

అలా జరిగింది…

రాకేశ్ గారు.. సాయి కొర్రపాటి గారు ఈ సినిమా కోసం కొత్త వాళ్ళను చూస్తుంటే సత్యానంద్ గారు పంపిన ఫోటోస్ లో నా ఫోటో కూడా ఉంది. సాయి కొర్రపాటి గారు నా ఫోటో చూసి, ఈ అబ్బాయి ఫోటోస్ ఇంకా కొన్ని పంపమని అడిగినప్పుడు , సత్యానంద్ గారు.. చిరంజీవి గారి అల్లుడు అని చెప్పడం జరిగింది…

 

నేనలా అనుకుంటున్నా…

మాస్ హీరోనే అనిపించుకోవాలి అనే ఆలోచన నాకు లేదు. ప్రతి జోనర్ లో నటించాలి.. నా సినిమాలో డ్రామా ఉండాలి.. రియలిస్టిక్ గా ఉండాలి… అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది.

వర్కింగ్ టైటిల్ వేరు…

సినిమాకి వర్కింగ్ టైటిల్ ఆల్రెడీ పెట్టుకున్నాం… 60% షూటింగ్ అయిపోయాక సాయి గారు ఈ టైటిల్ సజెస్ట్ చేశారు. టైటిల్ ని చూస్తే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ అయ్యే చాన్సెస్ ఉంటాయని భయపడ్డా… తరవాత స్టోరీ పరంగా ఆలోచిస్తే ఈ టైటిలే పర్ఫెక్ట్ అనిపించింది…

నేను బాడీ బిల్డర్ నే కానీ…

ఈ సినిమా కోసం వర్కవుట్ చేయాల్సి వచ్చింది. విజేత సెట్స్ పైకి రాకముందు నాకు మజిల్స్ ఉండేవి. డైరెక్టర్ గారేమో, అప్పుడే ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన కుర్రాడిలా కనబడాలి కాబట్టి… మజిల్స్ ఉండకూడదు చెప్పారు… అందుకే తగ్గించేశా…

 

స్టోరీ ఇంపార్టెంట్…

ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలే చేయాలి అనే ఆలోచనలు లేవు… స్క్రిప్ట్ బావుంటే ఎలాంటి సినిమా అయినా చేసేస్తా…

ఫేవరేట్ మూవీస్…

రాణీ ముఖర్జీ బ్లాక్, ఫర్హాన్ అఖ్తర్ నటించిన భాగ్ మిల్కా భాగ్… ఇంకా చిరంజీవి గారు నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అంటే చాలా ఇష్టం…

అదే సినిమా…

తండ్రీ కొడుకుల అనుబంధాన్ని కళ్ళకు కట్టే సినిమా విజేత. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఫాదర్స్ కి వాళ్ళ కొడుకులు, కొడుకులకు వాళ్ళ ఫాదర్ గుర్తుకు వస్తారు.. అంతలా కనెక్ట్ అయిపోతారు.